contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

న్యాయం కోసం వెళ్లిన విద్యార్థి పై సీఐ, ఎస్ఐ దాడి !

అన్నమయ్య జిల్లా కలకడ: న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన న్యాయ విద్యార్థిపై న్యాయవాది రఫి సమక్షంలోనే కలకడ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ లు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఘటనపై బాదితులతో కలసి సిపిఐ జిల్లా కార్యదర్శి సాంబశివ బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో మీడియాకు చెప్పిన వివరాల మేరకు, కలకడ మండలం, యెనుగొండ పాళ్యం గ్రామం, గుండావాండ్లపల్లె సర్వే నెంబర్ 772/ఎ లెటర్లో ఉన్న సంసిష్టం (జాయింట్ భూమి) లోని 12.30 ఎకరాల భూమిలో టి. నాగప్ప నాయుడు పేరు మీద 1991లో అదే మండలం, కదిరాయ చెరువుకు చెందిన దిండుకుర్తి సూర్యనారాయణ శెట్టి దగ్గర నాలుగు ఎకరాల సెటిల్ మెంటు వ్యవసాయ భూమిని కొని రిజిస్టర్ చేసుకొన్నారు. 12.30 ఎకరాల్లో రోడ్డుకు పోనూ నాలుగు ఎకరాల భూమిని మొదటి రిజిస్టర్ చేసుకుని పాసు బుక్కులు ఆన్ లైన్ లలో అన్ని హక్కులు కలిగి వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఆ భూమికి ఆనుకుని దక్షిణం వైపు ఉన్న రైతు జయన్న రెండు ఎకరాలు సంసిష్టం (జాయింట్ భూమి) లో సూర్య నారాయణశెట్టి దగ్గర కొన్నాడు. బాదిత రైతుకు ఉత్తరం వైపు ఉన్న మరో రైతు రెడ్డెప్ప సంసిష్టంలో ఉన్న మరో 5.5 ఎకరాల భూమిని సూర్య నారాయణ శెట్టి దగ్గర కొన్నాడు. మూడవ వ్వక్తి వద్ద నాగప్ప నాయుని భూమి పక్కనే ఉన్న మరో మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన బత్తల చిన్నప్ప నాలుగు ఎకరాల భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, నాగప్ప నాయుని వ్యవసాయ భూమిని ఒక ఎకర కబ్జా చేశాడన్నారు. భూ కబ్జా పై కలకడ పోలీస్ స్టేషన్లలో పలు మార్లు ఫిర్యాదు చేసినా, మూడు సార్లు సర్వే చేయించినా కబ్జా భూమి నుంచి తమకు న్యాయం చేయాలని కోరితే బాదితులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. చుట్టూ కంచె వేసుకోవడానికి రాతి కూసాలు తోలితే నాటు కోకుండా చిన్నప్ప, తన వర్గీయలతో గొడవ కొచ్చి అడ్డుకొంటున్నారని పోలీసులకు పదే పదే ఫిర్యాదు చేస్తే పట్టించు కోవడం లేదన్నారు. మంగళవారం చిన్నప్ప వర్గీయలు భూ కబ్జా చేసి దుక్కి దున్నడానికి వచ్చి ఆవులను తమ పొలంలోకి ఆవులతో వస్తుంటే బాదితులు డైల్ 100 కు ఫోన్ చేశారు. పోలీసులు పొలం వద్దకు వచ్చి ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు రమ్మనడంతో వీరనాగప్ప నాయుడు, కొడుకు నాగేశ్వర్ నాయుడు వెళ్ళి చిన్నప్ప భూ కబ్జా చేస్తుంటే తమరికి ఫిర్యాదు చేయాల్చి వచ్చిందని సీఐ శ్రీనివాస్ తో మాట్లాడారు. కబ్జా రాయుళ్లపై కేసు రిజిస్టర్ చేయాలని కోరగా న్యాయ విద్యార్థి నాగేశ్వర్ నాయున్ని సీఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సెల్ ఫోన్ లాక్కొని, గట్టిగా అరుస్తూ చేయి చేసుకుని కొట్టి భయ బ్రాంతులకు గురిచేసారు. న్యాయవాది సమక్షంలోనే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన న్యాయ విద్యార్థిని కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని బాదితుల తరపున సిపిఐ జిల్లా కార్యదర్శి సాంబ డిమాండ్ చేశారు. న్యాయ విద్యార్తిని కొట్టిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని సస్పెండ్ చేయాలన్నారు. అలాగే భూమిని కబ్జాచేసిన చిన్నప్ప, అతని వర్గీయులపై కేసులు వెంటనే రిజిస్టర్ చేసి న్యాయం చేయాలన్నారు. మరో మారు భూ వివాదం తలెత్త కుండా రెవిన్యూ అధికారులు సరి హద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :