పల్నాడు జిల్లా ,మాచర్ల / ప్రకాశం జిల్లా : మాచర్ల ఎస్సై బత్తుల గోపాల్ పై పల్నాడు జిల్లా ఎస్పికి ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి కోట వెంకట సుబ్బయ్య లు ఫిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళితే గత ఏడాది జూన్ లో రావిపాడు గ్రామానికి చెందిన కోట వెంకట సుబ్బయ్య కి సంబంధించిన 3.75 ఎకరాల పొలం తన భార్య వరలక్ష్మి పేరుతో 37లక్షలకి ఎస్సై గోపాల్ కొని 24 లక్షలు చెల్లించి, మిగతా 13 లక్షలు ఇవ్వకుండ బెదిరింపులకు పాలుపడుతున్నారని, డబ్బులు అడిగితే చంపేస్తామని ఎస్సై బత్తుల గోపాల్ సోదరరుడు వైసీపీ ఉప సర్పంచ్ ఈశ్వరయ్య బెదిరిస్తున్నాడని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కి ఫిర్యాదు చేసినట్టు సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.