అన్నమయ్య జిల్లా మదనపల్లె: అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతానని మదనపల్లె 1 టౌన్ నూతన సీఐ చాంద్ బాషా తెలిపారు. సీఐగా చాంద్ బాష మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్ కుమార్ నాలుగు రోజుల క్రితం సీఐల బదిలీలు, నియామక ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఇక్కడ సీఐగా పనిచేసిన వల్లిబాష జిల్లాలోని రాయచోటి హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించి, ఆయన స్థానంలో సీఐ ప్రసాద్ ను నియమించారు. వారం రోజుల్లోనే సీఐ ప్రసాద్ ను బదిలీ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కొత్త సీఐ గా చాంద్ బాషను నియమించడం విశేషం.