ప్రకాశం జిల్లా, ఒంగోలు రూరల్ సిఐ గా ఎన్. శ్రీకాంత్ బాబు బాధ్యతలు చేపట్టారు. ఎస్‌ఐలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రజల రక్షణకోసం నిరంతరం పనిచేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అక్రమ మద్యం, పేకాట, గంజాయి వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
