మహబూబాబాద్ జిల్లా / కొత్తగూడ / గంగారం : నేటి నుంచి అక్టోబర్ 20 వరకూ మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. దీంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఏజెన్సీ మండలాలలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వేడుకలను విజయవంతం చేయాలంటూ లేఖల ద్వారా మావోయిస్టు పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అందులో భాగంగా సరిహద్దు అటవీ ప్రాంతాలకు భారీగా బలగాలను తరలిస్తున్నారు. వందల సంఖ్యలో దండకారణ్యానికి చేరుకుంటున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు కూబింగ్ ను ముమ్మరం చేశాయి. దీంతో సరిహద్దుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
శుక్రవారం రోజు కొత్తగూడెం మండల కేంద్రంలో సంత నిర్వహించడంతో మావోయిస్టులు, దుకాణాల సముదాయం వద్ద పోలీస్ డాగ్ స్కాడ్ తో విస్తృత తనిఖీలు చేపట్టారు. గత వారం రోజులుగా నిత్యం వాహన తనిఖీలు గ్రామాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తూ అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. కొత్తగూడ, గంగారం మండలాలపై సిఐ బాబురావు, ఎస్సై కుశకుమార్ ప్రత్యేక నిఘా విభాగంతో దర్యాప్తును ముమ్మరం చ్చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.