డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: గత మే నెలలో కొత్తపేటలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేదించారు. కొత్తపేట మండలం బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ ఇంటి తలుపులు బద్దలు కొట్టి, బీరువాలో ఉంచిన 212 గ్రాముల బంగారం మరియు రెండు కేజీల సిల్వర్ టైటాన్ వాచ్, సుమారు 13 లక్షల విలువగల వస్తువులు దొంగతనం చేయబడినట్లు కేసు నమోదు అయింది.
ఈ దొంగతనం కేసును ఛేదించడానికి SDPO వై గోవిందరావు ఆధ్వర్యంలో రావులపాలెం సీఐ సిహెచ్ విద్యాసాగర్, కొత్తపేట ఎస్సై జి సురేంద్ర మరియు వారి సిబ్బంది ప్రయత్నించారు. వారు ఇద్దరు ముద్దాయిలను పట్టుకుని, వారి వద్దనుండి సుమారు 13 లక్షల విలువైన వస్తువులను రికవరీ చేసినట్లు తెలిపారు.