ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీస్ స్టేషన్లో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి పురస్కరించుకొని సీఐ సుబ్బారావు వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. మనమంతా ఆ మహాత్ముని ఆదర్శాలను అనుసరిస్తూ శాంతి, సమానత్వం,మతసామరస్యాన్ని పాటిస్తూ ముందుకు సాగాలి అని మాట్లాడారు.
భారతదేశ స్వాతంత్ర సాధనలో మహనీయుల యొక్క పాత్రను గురించి, అహింసా మార్గంలో వారు నడిపిన ఉద్యమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు