తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహేష్ బాబు మరియు హెడ్ కానిస్టేబుల్ మొగిలీశ్వర్ రెడ్డి లను క్రమశిక్షణ చర్యలలో భాగంగా సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఒక రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేయకుండా అలసత్వం ప్రదర్శించి, ముద్దాయి పేరును తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని ఎస్పీ తెలిపారు.
బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వర్తిస్తూ, చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ. క్రమశిక్షణా చర్యలలో భాగంగా సదరు పాకాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ బాబు మరియు స్టేషన్ రైటర్ హెడ్ కానిస్టేబుల్ – 2839 మొగిలీశ్వర్ రెడ్డి లను వెంటనే సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసులు చట్టం ప్రకారం చిత్తశుద్ధి, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, జిల్లా పోలీసులను హెచ్చరించారు.