ఒంగోలు నగరంలో రోడ్లపై జరుగుతున్న యాక్సిడెంట్లు ,ప్రమాదాలు పై పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఒంగోలు మంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద మీడియాకు తెలియజేశారు తల్లిదండ్రులు డ్రైవింగ్ చేతగాని పిల్లలకు లైసెన్స్ లేకుండా ఉన్న పిల్లలకు వెహికల్స్ ఇవ్వవద్దని అలాగే కొంతమంది నెంబర్ ప్లేట్లు లేకుండా టూవీలర్స్ నడుపుతున్నారని సోమవారం కొప్పోలు లో జరిగిన యాక్సిడెంట్ లో ముగ్గురు పిల్లల ప్రాణాలు పోగొట్టుకున్నారని దానివలన వారి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని వారి బాధ వర్ణనాతీతం అని తెలిపారు అలా జరగకుండా పిల్లల ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు అట్లాగే ఆటోలు కూడా నెంబర్లు లేకుండా నడుపుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే ప్రజలు పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పిల్లలకు తెలియజేయాలని పిల్లల బంగారు భవిష్యత్తు ప్రాణాలు కాపాడాలని ఒంగోలు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు తెలిపారు.