కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : జైనూర్ మండల కేంద్రంలో. కాశీ పటేల్ గూడా లోని చేతన ఫౌండేషన్ సంస్థ సహకారంతో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్, డిఎస్పి కర్ణాకర్, సీఐ రమేష్. ఎస్సై రామారావు.. ఏర్పాటుచేసిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జైనూర్ సిర్పూర్.(యూ) మండలాలములోని పేద ఆదివాసి మహిళలకు 32 కుట్టుమిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు సందర్భంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్ల ద్వారా ఆర్థికంగా బలంగా నిలబడాలని, ఏమన్నా సమస్యలు ఉన్న పోలీసుల దృష్టికి తీసుకురావాలని, మరిన్ని ఉపాధి అవకాశాలు పోలీసుల ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.