జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో మై ఆటో సేఫ్ కార్యక్రమాన్ని జిల్లా పోలీసు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. పలువురు ఆటో డ్రైవర్లను ఎస్పీ సన్మానించారు. అనంతరం ఆటోలకు QR కోడ్ కలిగిన స్టికర్లను ఎస్పీ అతికించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ప్రతి ఒక్క ఆటోలకు QR కోడ్ లను వేయడం జరిగిందన్నారు. ప్రయాణికులకు భద్రత, నమ్మకాన్ని కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా ఈ మై ఆటో ఇస్ సేఫ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. QR కోడ్ స్టిక్కర్లు అతికించడం ద్వారా అనుకోని సంఘటనలు జరిగునప్పుడు తొందరగా గుర్తించవచ్చునని అలాగే విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు సులభంగా పట్టు కోవచ్చునని తెలిపారు. డ్రైవర్ గాని ఓనర్స్ గాని అందరి డీటెయిల్స్ పోలీసు దగ్గర రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మకంతో ఆటోలు ఎక్కుతారని అలాగే ఎక్కిన వాళ్ళకి ధైర్యంగా ఉంటుందని తెలిపారు. QR కోడ్ ఉండటం వల్ల
డ్రైవర్లు క్రమశిక్షణ మరియు బాధ్యతతో ఆటోలు నడుపుతారని దాని వల్ల ప్రమాదాలు నివారించవచ్చునని చెప్పారు. జిల్లా ప్రజలు సైబర్ మోసాలు బారిన పడవద్దని, ఆగంతకులు ఫోన్ చేస్తే రెస్పాండ్ కావద్దని చూచించారు. OTP నంబర్2ఇతరులతో షేర్ చేసుకోవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి DSP రాములు, RTO శ్రీనివాస్, CI అనిల్, ఎస్సైలు, మునిసిపల్ కమిషనర్ మోహన్, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు