హైదరాబాద్ : ఓ వాహనదారుడు ట్రాఫిక్ ఎస్సైపై దురుసుగా ప్రవర్తించాడు. సికింద్రాబాద్‌లోని బోయినపల్లి వద్ద ట్రాఫిక్ ఎస్సైతో షోయబ్ అనే వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు షోయబ్ వాహనాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన షోయబ్ నా వాహనాన్నే ఆపుతారా అంటూ పోలీసులపై దాడికి ప్రయత్నించాడు.
వాహనానికి ఫోకస్ లైట్లు ఎందుకు వేశావని ఎస్సై ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాహనదారుడు ట్రాఫిక్ ఎస్సైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, తనపై పోలీసులే దాడి చేశారని షోయబ్ ఆరోపిస్తున్నాడు.