రాజన్న సిరిసిల్ల జిల్లా: సి.ఇ.ఐ.ఆర్ అప్లికేషన్ సహాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను పట్టుకొని బాధితుడికి అప్పగించడం జరిగింది అని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన గొర్రె రాము తన 18,000/- విలువ గల రెడ్మీ 12 సి మొబైల్ ఫోన్ డిసెంబర్ 15 వ తేదీన 2023 పోయిందని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కు రాగా వారి మొబైల్ ఫోన్ ల వివరాలను సి.ఇ.ఐ.ఆర్ అప్లికేషన్ లో నమోదు చేయగా అట్టి ఫోన్ లో వేరే వ్యక్తి సిమ్ కార్డు వేయడంతో పోలీస్ స్టేషన్ కు అలెర్ట్ మెసేజ్ రావడం తో అట్టి మొబైల్ ఫోన్ ను గుర్తించి , బాధితుడికి అప్పగించడం జరిగింది అని, దీనితో మొబైల్ ఫోన్ పోయిన భాదితుడు ఆనందాన్ని వ్యక్తం చేశారని అయన తెలిపారు. ఈ మొబైల్ ఫోన్ నీ గుర్తించడం లో కృషి చేసిన ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది పి.సి కె.లక్ష్మీనారాయణ లను ఎస్సై డి సుధాకర్ అభినందించారు. మండలంలో ఎవరివైన మొబైల్ ఫోన్లు పోయినట్లయితే వెంటనే ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయాలని అయన తెలిపారు.