పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లోని పిల్లుట్ల రోడ్డులో మాచవరం మండలం మోర్జంపాడు గ్రామం వైపు నుంచి వస్తున్న షిఫ్ట్ కారులో నెంబర్ ఏపి 30AM 4287 సుమారు 1200 పైగా తెలంగాణ మద్యం బాటిల్స్ ను పిడుగురాళ్ల పట్టణ పోలీసులు గుర్తించి స్వాధీనపరుచుకున్నారు. బాటిల్స్ తో పాటు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నిందితుడు పాశం రామ కోటయ్యను అదుపులోకి తీసుకొని కారును స్వాధీన పరుచుకున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మీడియా సమావేశంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు , ఎస్బి ఏ ఎసై మస్తాన్, ఏ ఎసైలు సుబ్బారావు , వలి ఉన్నారు.