పోలీస్ అధికారి బాధ్యతలు మరియు సి.అర్. పి.సి సెక్షన్ 41 బి అరెస్ట్ చేయు విధానము.
పోలీస్ అధికారి బాధ్యతలు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన సమయంలో ప్రతి పోలీస్ అధికారి తప్పనిసరిగా ఈ క్రింది విధంగా వ్యవహరించవలెను.
ఏ. తన పేరును హోదాను గుర్తించుటకు వీలుగా తన పేరును హోదాను స్పష్టంగా తెలియపరచు గుర్తింపు చిహ్నాన్ని తప్పనిసరిగా ధరించి ఉండాలి.
బి. అరెస్టు చేసినపుడు ఒక మెమోరాండం తయారు చేయాలి. ఆ మెమోరాండం పై
i.అరెస్ట్ కాబడిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు కనీసం ఒక్కరైనా సంతకం చేయాలి. లేక అరెస్టు జరిగిన ప్రాంతంలో నివసిస్తున్న ఒక గౌరవనీయులైన వ్యక్తి సంతకం చేయాలి.
ii.అరెస్ట్ కాబడిన వ్యక్తి కూడా సంతకం చేయాలి.
సి.అరెస్టు కాబడిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు మెమోరాండం పై సంతకం చేయనట్లయితే (ఇంటి వద్ద కాకుండా మరో ప్రదేశంలో అరెస్టు చేసిన సందర్భంలో అని భావము), తన తనను అరెస్టు చేసిన విషయాన్ని తన బంధువు గాని మెసేజ్ గాని తెలియపరచు హక్కు ఉన్నదని అతనికి చెప్పాలి.