రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసు కున్నాయి.
ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయి స్టులు ఉన్నారు.
ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.