మంగళగిరి టౌన్ పోలీస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ది.17.05.2023 తేదీన అన్నరోగ్యంతో కలవకొలను మాధవ రావు మరణించడం జరిగినది.
2011 బ్యాచ్ కి చెందిన K. మాధవ రావు కుటుంబానికి రూ.5,25,000/- ఆర్ధిక సహాయాన్ని తోటి బ్యాచ్ వాళ్ళు మరియు పోలీస్ అధికారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ మైలా సాంబశివ రావు Rs. 10,000/- జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్, IPS చేతుల మీదుగా వారి భార్య అయిన శ్రీమతి K. స్వప్న కి అందజేసినారు.
ఆపదలో ఉన్న తమ సహోద్యోగి యొక్క కుటుంబానికి సహాయం అందించాలనే 2011 బ్యాచ్ వారి సంకల్పం,వారి సేవా దృక్పథం ఎంతో గొప్పది.ఇదే ఐక్యతను,ఉదారతను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ,2011 బ్యాచ్ వారిని అభినందిస్తున్నాను అని శ్రీ ఎస్పీగారు తెలిపారు.
అదే విధంగా కానిస్టేబుల్ K. మాధవ రావు గారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా,అండగా ఉంటుందని,వారికి శాఖపరంగా రావలసిన అన్ని బెనిఫిట్లను అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీగారుతో పాటు గుంటూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీ ఆరోగ్య రాజు గారు, welfare RI రాజా రావు గారు, Association Treasurer హుస్సేన్ గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు T. మాణిక్యాల రావు గారు, వైస్ ప్రెసిడెంట్ మైల సాంబశివ రావు, గారు SP గారి CC శ్రీనివాస రావు గారు 2011 Batch Constables అయిన అనంత కోటేశ్వర రావు, నాగి రెడ్డి, వేణు, శివ నాగేశ్వర రావు, ప్రసాద్, పుష్పా రాజ్, నాగార్జున, జాన్ సైదా, వెంకట స్వామి, రఘు, సుమన్ ,తదితరులు పాల్గొన్నారు.