- పాంగి రాజారావు మీద తప్పుడు ప్రచారం తగదు. అరుకు నియోజకవర్గ కో కన్వీనర్ శెట్టి రాజు
- నిరూపణ ఉంటే మాట్లాడండి. బురద జల్లే ప్రయత్నం చేయవద్దు.
అయ్యా! పాంగి చిన్నారావు, సమర్ధి భాస్కర రావు!!!!! మీరందరూ రాజారావు చోటా మోటా నాయకుడు, ఆయన ఎన్ని పార్టీలు మార్చిన జనాలు నమ్మడం లేదు, అని చెప్పారు. నిజంగా ఆయన చోటామోటా నాయకుడు అయితే, ఆయన గురించి ఇంత గట్టిగా ఖండనలు ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది?
అది అలా ఉంటే, మీ రవి బాబు గతంలో టిడిపిలో వచ్చి, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్లి, అక్కడి నుంచి వైసీపీకి వెళ్లి, తర్వాత మళ్లీ టీడీపీలోకి వచ్చి, ఇప్పుడు మళ్ళీ వైసీపీలో ఉన్నారు. అంటే ఆయన పార్టీలు మారినట్టు కాదా? ఆయన ఏ ఉద్దేశ్యంతో ఎన్నిసార్లు పార్టీలు మారారు? ఇది ఆయన లోని అభద్రతాభావం చిహ్నం కాదా? తరువాత వాలాసిలో జరుగుతున్న కాల్ సైట్ గనుల తవ్వకాలలో ఆయనకు ఏ రకమైన పాత్ర లేదా? ఇదివరలో బొర్ర దగ్గర మైనింగ్ చేసిన చరిత్ర ఆయనకు లేదా? ఎక్కడి నుంచో వచ్చిన ఆయన ఇక్కడ వందల ఎకరాల భూములు కొనడం నిజం కాదా? ఫామ్ హౌస్ లు కట్టించడం నిజం కాదా? ఈ విషయాలు మీకు తెలియకుండా మాట్లాడుతున్నారా? లేక ఎవరికీ తెలియదులే అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారా? ముందు మిమ్మల్ని మీరు, మీ నాయకుల్ని, మీ పార్టీని చక్కదిద్దుకొని, మిగిలిన వారి గురించి మాట్లాడితే బాగుంటుంది. రాజారావు ఏదో భూ దంతాలు చేస్తున్నారు అని చెప్పారు. మీకు నిజంగా తెలిస్తే, చేతనైతే, వాటిని నిరూపించగలగడం మీ వల్ల అయితే, నిరూపించి చూపించండి. అంతేగాని అర్థంపర్థం లేని అనాలోచిత ఆరోపణలు చేస్తే, దానికి సమాధానం చెప్పడానికి ఇటుపక్క కూడా జనాలు ఉన్నారని సంగతి మర్చిపోకండి అంటూ అనంతగిరి మండల భారతీయ జనతా పార్టీ అరుకు నియోజకవర్గ కో కన్వీనర్ శెట్టి రాజు సూటిగా ప్రశ్నలు సంధించారు.