కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 16 గ్రామపంచాయతీలో 17920 ఓటర్లు ఉండగా 15057 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటింగ్ శాతం 84.02 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ మండల కేంద్రముతో పాటు వివిధ గ్రామాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ మండల కేంద్రం గన్నేరువరంతోపాటు వివిధ గ్రామాల్లోనూ పోలింగ్ సరళిని పరిశీలించారు. మండల కేంద్రం గన్నేరువరంలో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి.