హైదరాబాద్: ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి..రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి..ఎంత పెద్ద వాళ్లు ఉన్న చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు.. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది..
మీ ప్రాంతంలో ఎక్కడ అర్టిఏ ద్వారా తీసుకున్న పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన వారసత్వపు చెరువులు ఎక్కడెక్కడ ఉన్నయో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్ద వారైనా ఏ పార్టీ వారైనా సమాచారాన్ని ప్రభుత్వానికి పిర్యాదు చేయండి..ముఖ్యంగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్ ,రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరానికి చెరువులను కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలో స్వచ్చందంగా మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ముందుకు రావాలి..