contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

లోయర్ మానేరు డ్యామ్ ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ జిల్లా: ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,ఇతర అధికారులతో కలిసి లోయర్ మానేరు డ్యాం ను ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కూరు స్తున్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.. గత కొంత కాలంగా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు , చెరువులు, కుంటలు నిండుతున్నాయి.. మరో రెండు రోజులు పాటు వర్షాలు ఉన్నాయి. జిల్లాలో పునరావాస కేంద్రాలకు తరలించెంత ఇళ్లలో నుండి ప్రజలను ఖాళీ చేసే పరిస్థితి ఎక్కడ లేదు..ప్రాణ నష్టం ఎక్కడ లేదు

కోహెడ – ముల్కనూరు ఇల్లంతకుంట మండలంలో తదితర ప్రాంతాల్లో రోడ్ల మీద నుండి వరద పోవడం వల్ల రవాణా అగిపోయింది.. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో మొదలైంది..ఎల్ఎండి లో 24 టీఎంసీ లకు ప్రస్తుతం 14 టిఎంసి ల ఉన్నాయి. మిడ్ మానేరు కు మోయ తుమ్మెద వాగు , మూల వాగు నుండి వరద వస్తుంది. ఎల్లంపల్లి నుండి రోజువారీగా ఇప్పటికే నీటి విడుదల జరుగుతుంది.. మిడ్ మానేరు ,లోయర్ మానేరు , రంగ నాయక సాగర్ ,మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు ప్రాజెక్ట్ లో నింపుకునే విధంగా వర్షాలు పడ్డాయి..అటు కిందికి కోదాడ వరకు నీళ్ళు అందించవచ్చు.. కరీంనగర్ తో పాటు ఇతర మున్సిపాలిటీ లలో ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఇళ్లల్లోకి వచ్చిన పరిస్థితి ఎక్కడ లేదు..అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం.. అక్కడక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర క్లియర్ చేస్తున్నారు.. అందరూ అధికారులు క్షేత్ర స్థాయిలో వారు కేంద్రాల్లో నిరంతరం పని చేస్తున్నారు..
హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా అక్కడ అధికారులతో మాట్లాడను ఎక్కడ ఇబ్బంది లేదన్నారు. హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు లలో లెవెల్స్ నిండే పరిస్థితి ఉంది.. కాళేశ్వరం లో టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నీటి నిల్వ కొనసాగుతుంది.. ఎల్లంపల్లి నుండి ప్రతి చుక్క ఉపయోగించుకునే విధంగా ప్రాజెక్ట్ లలో పంపిస్తాం.. శ్రీరామ్ సాగర్ లో ప్రస్తుతం 64 టిఎంసి ల ఉన్నాయి..పూర్తి స్థాయి నిండగానే వరద కాలువ ద్వారా నీళ్ళు విడుదల జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లో తమ్మడి హట్టి నుండి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు నీళ్లు తీసుకొచ్చేది.. ఆ నీరు మిడ్ మానేరు ,రంగ నాయక సాగర్,మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్ లకు తీసుకుపోయేది..ఇప్పుడు నీరు కిందికి వృథాగా పోతున్నాయి.. రాబోయే కాలంలో వ్యవసాయం ఇబ్బందులు ఉండవు..ప్రతిపక్షాలు వ్యవసాయానికి ఇబ్బందులు ఉండడద్దని కోరుకోవాలి..  వర్షాలు,ప్రాజెక్టులు, వ్యవసాయం పేరు మీద రాజకీయాలు చేయద్దు.. ముఖ్యమంత్రి సీఎస్ కి ఆదేశించారు.. సిఎస్ కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు..హైదరాబాద్ లాంటి వర్షాలు ఎక్కువగా ప్రాంతాల్లో స్కూల్ లకు సెలవులు ఇచ్చారు.. హైదరాబాద్ లో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు..లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు ,ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి..రోడ్ల పై వరద వెళ్తుంటే ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి ఇవ్వకూడదు. సిద్దిపేట – హనుమకొండ దారిలో కూడా వరద పోతుంది..ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు సహకరించాలి అని అన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :