- పాదయాత్రలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ
- అభివృద్ధిని ప్రశ్నిస్తే నిర్బంధాల
- ఇదేమి పాలన
కరీంనగర్ గన్నేరువరం : ప్రజా సమస్యలతో పాటు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం గుండ్లపల్లి నుంచి వయా గన్నేరువరం పుత్తూరు గ్రామం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి పాల్గొన్నారు. నాడు ఆంధ్ర పాలకులతో దగా పడ్డ తెలంగాణ నేడు కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవడం బాధాకరమన్నారు. డబల్ రోడ్డు కోసం పోరాటాలు చేసే వారిని అణిచివేతే ధోరణి సబబు కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదా అని ప్రశ్నించారు. గంగులతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఎమ్మెల్యేతో పాటు చొక్కారావు పల్లె నుంచి బ్రిడ్జి నిర్మాణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు.అధ్వానంగా రహదారు లు మానకొండూరు నియోజకవర్గం లో రహదారులు స్థితి అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అభివృద్ధిపై అనాలోచిత నిర్ణయాలతో ఈ దుస్థితి నెలకొందని జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గొంగడి గోసి తప్ప ఏముందన్న ఎమ్మెల్యేకు నేడు అదే బంగారు గొంగడిగా మారిందని తెలిపారు. వలసవాదులతో నాడు తెలంగాణ రాష్ట్రం తెగపడితే. నేడు వలస ఎమ్మెల్యే తో నియోజకవర్గ దోపిడీకి దగాకు గురవుతుందని అన్నారు. అరెస్టులు నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు,ఈ సందర్భంగా ఇందిర గాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని మండల కేంద్రం గన్నేరువరంలో ఆవిష్కరించారు. పాదయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు,కార్యక్రమంలో కవ్వంపల్లి డాక్టర్ అనురాధ, పార్టీ మండల అధ్యక్షుడు చిట్కూరి అనంతరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మేర రవీందర్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్య ప్రసన్న రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, తిట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ రోహిత్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మ కర్ణాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, నియోజవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్,యూత్ నాయకులు దేశరాజు అనిల్, ముస్కు ఉపేందర్ రెడ్డి, చింతల శ్రీధర్,మార్గం మల్లేశం, తదితరులు పాల్గొన్నారు,