- ఈనెల 18వ తేదీన తాండూర్ జరిగే ప్రజా పోరు యాత్రను జయప్రదం చేయండి
- కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య
- సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎస్, సి, డబ్లూ జనరల్ సెక్రటరీ పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ప్రజా పోరుయాత్ర నియోజకవర్గంలోని తాండూర్ ఐబి లో జరిగే బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే నారాయణ హాజరవుతున్నారు.ఈ యాత్రను బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ నాయకత్వం వహిస్తున్నారు.
ఈ యాత్ర ద్వారా నియోజకవర్గంలోని స్థానిక సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచాలి అని డిమాండు చేస్తూ పోరుయాత్ర ఇంటింటి ప్రచారం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ గారు ,జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్, మరియు బెల్లంపల్లి నియోజకవర్గం కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ , రాష్ట్ర సమితి సభ్యులు.మిట్టపల్లి వెంకట స్వామి,చిప్ప నర్సయ్య, దాగం మల్లేష్. జిల్లా కార్యవర్గ సభ్యులు. బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి డిఅర్.శ్రీధర్. బియ్యాల ఉపేందర్ ,అక్కేపల్లి బాపు, రత్నం రాజయ్య ,బండారి శంకర్ . ఎల్తూరి శంకర్ . తదితరులు పాల్గొన్నారు