- వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరా
- జగనన్న కాలనీల విద్యుదీకరణ పనులు వేగవంతం
- బకాయిల వసూళ్ళకు ప్రాధాన్యతనివ్వండి
- -విద్యుత్ సమస్యలపై 1912కు కాల్ చేయండి
- సమీక్షా సమావేశంలో సిఎండి కె. సంతోష రావు సూచన.
తిరుపతి: ఎపిఎస్ పిడిసిఎల్ పరిధిలో వినియోగదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేసేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు అధికారులకు సూచించారు. ఎపిఎస్ పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో గురువారం సంస్థ పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు, జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎండి సంతోష రావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కు దరఖాస్తు చేసిన వెంటనే సర్వీసులను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులను సకాలంలో మంజూరు చేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సంబంధించి కాలిపోయిన నియంత్రికలను వేసవి తీవ్రత దృష్ట్యా పంటలకు నష్టం వాటిల్లకుండా తక్షణం మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పగటిపూట 9 గంటల విద్యుత్తును సరఫరా చేయాలన్నారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో విద్యుత్ వ్యవస్థను పటిష్టవంతం చేయడంద్వారా వినియోగదారులకు మెరుగైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జగనన్న కాలనీల విద్యుదీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. సంస్థ పరిధిలో పేరుకు పోయిన విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సంస్థ పరిధిలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల పరిధిలో విద్యుత్ పంపిణీ నష్టాలు ఎక్కువగా వున్న ఫీడర్లను గుర్తించి, నష్టాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, సత్వర సేవలందించేందుకు వీలుగా అధునాతన సాంకేతికతతో కాల్ సెంటర్ ను ఆధునీకరించడం జరిగిందని, విద్యుత్ అంతరాయాలు, సమస్యలపై టోల్ ఫ్రీ నంబరు: 1912కు కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
నూతన పంథాలో సమీక్ష
ఎపిఎసిడిసిఎల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని సంస్థ సిఎండి కె. సంతోష రావు నూతన పంథాలో నిర్వహించారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్లు తమ విభాగానికి సంబంధించిన వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, ఐదు జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు తమ జిల్లాలకు సంబంధించిన వివరాలను ప్రెజెంటేషన్ రూపంలో వెల్లడించారు. సంస్థ పరిధిలో వివిధ అంశాలపై సీఎండీ క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో లోటుపాట్లు, వాటిని అధిగమించేందుకు అవసరమైన సలహాలు, సూచనలను సిఎండి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్కమ్ డైరెక్టర్ (టెక్నికల్ &హెచ్ఆర్ డి) ఎన్.వి.ఎస్. సుబ్బరాజు, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కె. శివప్రసాద రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్లు డి.ఎస్. వరకుమార్, వి. సురేష్, డి.వి. చలపతి, పి. అయూబ్ ఖాన్, కె. గురవయ్య, వై. లక్ష్మీ నరసయ్య, విజయకుమార్ రెడ్డి, కె.ఆర్.ఎస్. ధర్మజ్ఞాని, జాయింట్ సెక్రటరీ ఎ. రాధా జయశ్రీ, ఓఎస్ డి శ్రీనివాసులు, జనరల్ మేనేజర్లు విఆర్కే రాజు, జానకి రామ్, బాలకృష్ణా రెడ్డి, ఆదిశేషయ్య, మురళి, శారద, పద్మ, రమణా దేవి, శోభా వాలెంటీనా, రవి, భాస్కర్ రెడ్డి, సురేంద్రరావు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు కృష్ణా రెడ్డి, వెంకటసుబ్బయ్య, ఉమాపతి, సురేంద్ర, మునిశంకరయ్య, 5 జిల్లాల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.