- కరంట్ కోసం….” కక్కుర్తి “
- సోలార్ పనులకోసం….సర్కార్ కరెంట్ చోరీ
- అడ్డాకల్ మండలంలో….అంతా వాళ్ళ ఇష్టం
- అడిగేందుకు అధికారులకు….భయం
- 4 రోజులుగా దర్జాగా…. విద్యుత్ చోరీ
- లో ఓల్టేజితో కాలిపోయిన….టీవీలు, ట్యూబ్ లైట్లు, మోటార్లు
- ఏఈ, ఏడిఈలకు పిర్యాదు చేసినా….స్పందించని వైనం
- ప్రజా ప్రతినిదిఐతే….ప్రశ్నించరా
- ప్రజాధనాన్ని లూటీ చేసినా….పట్టించుకోరా…..?
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
మహబూబ్ నగర్ జిల్లా అఢ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం: అయినోళ్ళకు ఆకుల్లో…. కానోళ్ళకు కంచంలో అన్న చందంగా తయారైంది విద్యుత్ అధికారులు పనితీరు. సామాన్యులకు ఒక న్యాయం…. అధికార పార్టీ నేతలకో న్యాయం అన్నటుగా వ్యవరిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులు. అధికార పార్టీ నేతలం……మమ్మల్ని అడిగే మొనగాళ్ళెవరూ…..అంటూ కరెంటు కోసం కక్కుర్తి పడి కరెంటు స్తంబానికే వైరు వేసి కరెంటును దర్జాగా చోరీ చేసిన, స్థానిక విద్యుత్ అధికారులు పట్టించుకొని సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అఢ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో గత మూడు, నాలుగు రోజులుగా కరెంటు స్తంబానికి దొంగ కనెక్షన్ ఇచ్చుకుని దర్జాగా విద్యుత్ చౌర్యం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇందులో మరో విశేషం ఏమిటంటే. కరెంటు చౌర్యం చేస్తున్న వ్యక్తి ఎవరో సామాన్యులు కాదు…..కడుపేదరికానికి చెందిన వ్యక్తి కాదు, బిపిఎల్ కు చెందిన వ్యక్తి అసలే కాదు….సదరు వ్యక్తి ఆయన్నే అధికార పార్టీ నేత, అడ్డాకుల మండలం ప్రజా ప్రతినిధి, ఎంపిపి నాగార్జునరెడ్డి.
ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ప్రజాధనాన్ని లూటీ చేస్తుంటే ప్రశ్నించే నాథుడే కరువయ్యాడు. తమ స్వాలభం కోసం తమ ఇంటి పైన సోలార్ ప్యానెల్ నిర్మాణ పనుల కోసం గత మూడు,నాలుగు రోజులుగా కరెంటు స్తంభానికి దర్జాగా దొంగతానంగా కనెక్షన్ ఇచ్చుకుని నడి రోడ్డు నుండి ఆ దొంగ కనెక్షన్ తీసుకెళ్ళాడు. దీంతో పొన్నకల్ గ్రామంలో పలు ఇండ్లలలో లో ఓల్టేజీ సమస్య ఎదుర్కొంది. దీంతో పలు ఇండ్లలలో టివిలు, ట్యూబ్ లైట్లు, మోటర్లతో పాటు సాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న ఆర్ఓ, వాటర్ పిల్టర్లు సైతం కాలిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అడ్డాకుల మండలంలో అంతా మా ఇష్టం….మమ్మల్ని అడుగేవారు ఎవరని సదరు అధికార పార్టీ నేత సామాన్య ప్రజానికాన్ని, బాధితులపై ఎదురు దాడి దిగడం శోచనీయం.
ఇదిలా ఉంటే అధికార పార్టీ నేత, అడ్డాకుల ఎంపిపి నాగార్జుణరెడ్డి తమ స్వంత అవసరాల కోసం, సోలార్ షెడ్ లకోసం కరెంటు లైన్ల కే దొంగ కనెక్షన్ తీసుకుని కరెంటు కోసం కక్కర్తి పడడం అందుకు లో ఓల్టేజీ సమస్యతో పాటు, విద్యుత్ సమతుల్యం కోల్పోయి పలు ఇండ్లలో టివి, ట్యూబ్ లైట్లు, తదితర వస్తువులు కాలి పోవడంతో పాటు ఆ బాధితులు స్ధానిక విద్యుత్ ఎఈ, డిఈలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. వస్తున్నాం…పంపిస్తున్నామంటూ …గత మూడు నాలుగు రోజులుగా ఎఈ, డిఈలు కాకమ్మ కథలు చెప్పుకుంటూ వస్తున్నారే తప్పే ఈ విద్యుత్ చౌర్యాన్ని ఆపడం లేదు. అడ్డాకుల ఎంపిపి అయితే అడిగే వారు ఎవరూ లేరా అని బాధిత, సామాన్య ప్రజానికం ప్రశ్నిస్తున్నారు.
విజిలెన్స్ కేసు నమోదు చేస్తాం: డిఈ కృష్ణమూర్తి
అడ్డాకల్ ఎంపీపీ నాగార్జునరెడ్డి కరెంట్ చోరి విషయమై సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ధ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ విద్యుత్ శాఖ డిఈ కృష్ణమూర్తికి పిర్యాదు చేయగా, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ లకు చెప్తాను, అవసరమైతే సోమవారం విజిలెన్స్ అధికారులను అక్కడికి పంపుతామని, కరెంట్ చోరీ జరిగినట్లు తేలితే విజిలెన్స్ కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.
ప్రజాధనాన్ని లూటీ చేసినా పట్టించుకోరా: దిడ్డి ప్రవీణ్ కుమార్
అడ్డాకుల ఎంపిపి నాగార్జునరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి , తన స్వంత పనుల కోసం కరెంటును చోరీ చేయడం ఎంతవరకు సమంజసమని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ధ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డాకుల మండలంలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు పెచ్చుమీరిపోయాయని ఆయన విమర్శించారు. సాక్ష్యాత్తు ఎంపిపి ఇలా చేస్తే ఇక సామాన్యుల పరిస్ధితి ఏమిటని ఆయన విమర్శించారు. గత మూడు,నాలుగు రోజులుగా తమ స్వంత ఇంటి పనుల కోసం నిబంధనలను తుంగలో తొక్కి నడిరోడ్డు వెంబడి బాజాప్తా కరెంటు వైర్లకు దొంగ జనెక్షన్లు ఇచ్చి తమ ఇంటిపై షెడ్ పనులు చేస్తున్నా కరెంటు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.
ఈ విషయమై ఎఈ, ఏడిఈలకు ఫిర్యాదు చేసినా గత మూడు నాలుగు రోజులుగా స్పందించకపోవడం చూస్తే కరెంటు శాఖ అధికారులకు సామాన్యుల కష్టాలపై ఎలాంటి చిత్తశుద్ది ఉందో స్పష్టమవుతోంది. అధికార పార్టీ ఎంపిపి నాగార్జునరెడ్డి స్వాలభం కోసం చేసినా ఈ విద్యుత్ చోరితో గత మూడు, నాలుగు రోజులుగా పొన్నకల్ గ్రామంలో పలు ఇండ్లలో లోఓల్టేజీ సమస్యతో ఖాళీపోయిన టివి, ట్యూబ్ లైట్లు, మోటర్లకు, వాటర్ పిల్టర్లకు నష్టపరిహారం సదరు అధికార పార్టీ నేత, అడ్డాకుల ఎంపిపి నాగార్జునరెడ్డి నుండి వెంటనే చెల్లించేలా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని లూటి చూసిన అడ్డాకుల ఎంపిపి నాగార్జునరెడ్డిపై విద్యుత్ చౌర్యం చట్టం కింద కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో ఎంపిపికి సహకరించిన కరెంటు శాఖ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సామాజిక కార్యకర్త , నేనుసైతం స్వచ్చంద సంస్ధ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.