రేపు ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించనున్నారు. ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ఈ ప్రత్యేక ప్రజావాణి కౌంటర్‌ను ప్రారంభిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొననున్నారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి బుధ, శక్రవారాల్లో ఈ ప్రత్యేక కౌంటర్ తెరిచి ఉంటుంది.