- ట్రాక్టర్ తిరగబడి వినాయక విగ్రహం ధ్వంసం అవ్వుట వలన పండుగను విరమించుకున్న దేసిరెడ్డి పల్లి గ్రామస్తులు
- పోలీస్ శాఖ తరుపున మరొక విగ్రహం పంపిన ప్రకాశం జిల్లా ఎస్పీ
- తమలో తిరిగి ఆనందం నింపిన జిల్లా ఎస్పీ
- పోలీస్ లకు కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్థులు
ప్రకాశం జిల్లా : దొనకొండ మండలం, దేసిరెడ్డి పల్లి గ్రామస్తులు వినాయక చవితి పండుగ సందర్భంగా మార్కాపురం నుండి గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసుకొనే వారి గ్రామానికి వెళుతుండగా దేవరాజుగట్టు జంక్షన్ సమీపంలో రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో వెనకనుండి లారీ ఢీ కొట్టగా ట్రాక్టర్ తిరగబడి విగ్రహం పూర్తిగా ధ్వసం అయింది అలాగే పలువురికి గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు పండుగను జరుపుకోవడం విరమించున్నారన్న సంగతి తెలుసుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ వారికి పోలీస్ శాఖ తరుపున వారికి గణేష్ విగ్రహాన్ని కొని పంపించారు. గ్రామస్తులు ఎస్పీ దామోదర్ కి అలాగే పోలీసు శాఖ వారికి కృతఙ్ఞతలు తెలిపారు.
అలాగే సంఘటన స్థలానికి చేరుకొని వారికి సహకరించిన సిఐ ప్రభార్ , వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.