ప్రకాశం జిల్లా : విజయవాడ వరద భాదితుల కొరకు ఆహార పొట్లాలు పంపిణీ చేసే కార్యక్రమములో భాగంగా ఈ నెల ఐదవ తేదీన పదివేల ఆహార పొట్లాలు అలాగే మరో పదివేల ఆహార పొట్లాలు ఈరోజు పంపించడం జరిగింది.
జిల్లా కలెక్టరు తమీమ్ జండా ఊపి ప్రారంభించారు. ఆహార పొట్లాలలతో పాటు కొంతమంది పంచాయతీ కార్యదర్శులు , పారిశుధ్య సిబ్బంది వరద పీడిత ప్రాంతలకు వెళ్ళి బాధితులకు ఆహారాన్ని అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా పంచాయతీ సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమములో కలెక్టరు , జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి, శివప్రసాద్, చక్రధర్, డీపీఆర్సీ సిబ్బంది ,రాష్ట్ర పంచాయతీ విభాగ ఉపాద్యక్షులు రామకృష్ణ ఇతర పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.