ప్రకాశం జిల్లా విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంట్ ఎ ఎస్పీ జె .కుల శేఖర్ అక్రమంగా రేషన్ బియ్యంను సేకరించి తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు విజిలెన్సు ,ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్, పొదిలి వారు సంయుక్తంగా కలసి సంతనూతలపాడు గ్రామం లోని ఎం /ఎస్ నాగరాజా ట్రేడర్స్ అను పేరుగల రైస్ మిల్లు ను తనిఖి చేయగా ఆరు వందల బస్తాలు పిడిఎస్ బియ్యం ను సదరు రైస్ మిల్లు యజమాని అయిన మోదుకూరి రాజేష్ గుప్తా అక్రమంగా నిల్వ వుంచి మూడు వాహనాల ద్వార నల్ల బజారు కు తరలించుటకు సిద్దంగా వుండగా , అధికారులు సదరు ఆరు వందల బస్తాల బియ్యంను సీజ్ చేసి తగు చర్యల నిమిత్తం రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న ఆరుగురిపై సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. అటులనే సెక్షన్ 6 (ఎ) కేసును జాయింట్ కలెక్టర్ (సి ఎస్), ప్రకాశం జిల్లా వారి కోర్ట్ నందు నమోదు చేయటం జరిగింది.
ఈ తనిఖీ లలో, విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డి సి టి ఓ రామారావు, ఎస్సై నాగేశ్వర రావు, తహసిల్దార్ వి ఎస్ పాల్ మరియు వారి సిబ్బంది మరియు సివిల్ సప్లైస్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గుణవంశి పాల్గొన్నారు.