సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామం సీనియర్ నాయకులు మాదాల నరసయ్య తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయలు మరియు నియోజకవర్గం లోని చీమకుర్తి పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్ కి 50వేల రూపాయలు ఒంగోలు మంగమూరు రోడ్ లోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మైనంపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.