ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చీమలమర్రి గ్రామ పరిధిలోని ఒంగోలు కర్నూల్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ కి చెందిన రవి, రాహుల్ అనే ఇద్దరు రోనార్క్ గ్రానైట్స్ లో పనిచేస్తుండగా, ఆదివారం సెలవు దినం కావడంతో చీమకుర్తి వెళ్లి మద్యం సేవించి ద్విచక్ర వాహనం పై వస్తూ ఉండగా మత్తులో వేగంగా వెళ్లి ఒంగోలు వైపు నుండి వచ్చే కారు ను ఢీ కొట్టారు.ఇరువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
అక్కడే ఉన్నా చీమలమర్రి స్థానికులు వారి యజమాని, బంధువుల వివరాలు సేకరించి ఇరువురిని చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
ప్రమాదం జరిగిన వారి చేతిలో ఖైనీ, గుట్కా ప్యాకెట్ లు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.