contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Prakasam Dist: బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని… !

ప్రకాశం జిల్లా / మోటుమాల : ఓ విద్యార్థిని హాస్టల్​ బాత్​రూమ్​లో ప్రసవించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్​ చదువుతున్న విద్యార్థిని బాత్రూంలో ప్రసవించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యాలయ అధికారులు విద్యార్థిని పరిస్థితి చూడగా ఆమె అనారోగ్యంగా ఉండటంతో అక్కడి నుంచి వెంటనే చికిత్స కోసం ఒంగోలు రిమ్స్​కు తరలించారు. అప్పటికే ఆ బిడ్డ మరణించినట్లు కస్తూర్బా సిబ్బంది గుర్తించారు.

విద్యార్థి రెండు నెలల నుంచి మోటుమాల వద్ద ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుందని విద్యాలయ అధికారులు తెలిపారు. విద్యాలయంలో చేరినప్పటికే బాలిక గర్భం దాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :