ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మల్లవరప్పాడు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తూర్పునాయుడుపాలెంలో 4.5 కోట్లతో 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన, ఎస్సీ కాలనీలోని 15 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చంద్రగిరి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దామచర్ల సత్య,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మా గుంట శ్రీనివాస్ రెడ్డి,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత,కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరుశాసనసభ్యులు ముత్త మాల అశోక్ రెడ్డి, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, మల్లవరప్పాడు గ్రామ సర్పంచ్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.