పొగాకు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పొగాకు శాతాన్ని పరిశీలిస్తే ఒక్క ప్రకాశం జిల్లాలోనే 65శాతం పొగాకు ఉత్పత్తి అవుతోంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు కొనుగోలు కేంద్ర లో జరిగిన వేలం లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయ్ కుమార్, విధ్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ జిల్లా లో గ్రేడ్ వన్ పొగాకుకు గరిష్ట రేటు 350 నుండి 370 రూపాయల వరకు గిట్టుబాటు ధర పలికిందని, వేలంలో పొగాకును సరైన గిట్టుబాటు ధరకు కొననాలి కొనుగోలుదారులను ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ఉన్నప్రతి రైతు ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పొగాకు బోర్డు సభ్యులు, రైతు నాయకులు, బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.