contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పెర్నమిట్టలో జిల్లా వాలిబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన … ఎమ్మెల్యే విజయ్ కుమార్

  • విద్యతో పాటు క్రీడల్లో కుడా ముందుండాలి .. ఎమ్మెలేయే విజయ్ కుమార్

 

ప్రకాశం జిల్లా / పెర్నమిట్ట: జిల్లా పరిషత్ హై స్కూల్‌లో నిర్వహించిన జిల్లా వాలిబాల్ టోర్నమెంట్‌ను సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు క్రీడల ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు.

ఎమ్ల్యే మాట్లాడుతూ, “విద్యతోపాటు అన్ని క్రీడల్లో కూడా ముందుండాలి. ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని  అన్నారు. క్రీడల ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, అందువల్ల విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని  సూచించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరు బాబు, విద్యా కమిటీ చైర్మన్ శ్రీలత, ఎంఈవో, ప్రిన్సిపాల్, సరస్వతి కాలేజీ చైర్మన్ రమణారెడ్డి, కరిచేటి శ్రీనివాసరావు, ఇవరం గోవింద్, వాసుపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, ఈదర విష్ణు, పెర్నమిట్ట పవన్, తన్నీరు వెంకట్రావు, పత్తిపాటి శ్రీనివాసరావు, కైలా శ్రీనివాసరావు, అలాగే టిడిపి, జనసేన నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆశిస్తున్నామని స్థానిక నేతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :