అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీం అన్సారియా, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బి.యన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మెరుగ్గా లేకపోయినా ఒకటో తారీకున పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు తెలియజేశారు. అన్ని రాష్ట్రాలలో కన్నా 4000 రూపాయల అధిక పించను ఆంధ్రప్రదేశ్ లోనే ఇస్తున్నట్లు, పింఛను 2000 నుండి 3000 రూపాయలు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్ల సమయం పట్టిందని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఐదేళ్లలో పింఛను 2000 నుండి 3000 రూపాయలకు పెంచడానికి ప్రయత్నించినట్లు ఆయన తెలియజేశారు.
ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే విజయ్ కుమార్, మరియు మంత్రి వయోవృద్ధులను సత్కరించి, వారి సమస్యలు తెలుసుకొని వారికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధికారులు, పలు విశ్రాంతి ఉద్యోగులు, వయో వృద్ధులు, జిల్లా తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.