- పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: మంత్రి వీరాంజనేయ స్వామి
- మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారతావనిని సాధించేందుకు కృషి చేద్దాం.
- మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
ప్రకాశం జిల్లా: మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛ భారత్‌ను సాధించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు.
బుధవారం నాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్‌లో ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పలు కళాశాలల విద్యార్థులతో కలిసి మంత్రి బీచ్‌లోని వ్యర్ధాలను తొలగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలమ”ని తెలిపారు. “పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామాజిక బాధ్యత. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశాన్ని రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారు” అని ఆయన అన్నారు.
“టిడిపి హయాంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చెత్త నుండి సంపద సృష్టించాం. ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డులు నిర్మించాం. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించాం” అని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమం నిర్వహించిన ఈనాడు, ఈటీవీ సంస్థను, కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు మరియు కాలేజీ విద్యార్థులను మంత్రి అభినందించారు.
స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.