ప్రకాశం / ఒంగోలు : జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, మైనింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారిచేయడమైనది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు రెవెన్యూ, పోలీస్, కమర్షియల్ ట్యాక్స్, మైన్స్ మరియు జియాలజీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అవసరమైన మేర మొబైల్ టీం లను ఏర్పాటుతో పాటు కమిటీలో చర్చించిన విధంగా రెండు చెక్ పోష్టులను ఏర్పాటుతో పాటు అవసరమైన ప్రదేశాల్లో సిసిటివి లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మైనింగ్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై ఇటీవల తరచూ పిర్యాదులు వస్తున్నాయని అన్నారు.