ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం బి. నిడమానూరు గ్రామం క్రిస్టియన్ కాలనీ నందు ఆదివారం మధ్యాహ్నం హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనలో భాగంగా బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.వి.సాగర్ ఆధ్వర్యంలో హెల్ప్ టి ఐ నాగులుప్పలపాడు మండల ఔట్రిచ్ వర్కర్ ఎం మల్లేశ్వరి అధ్యక్షతన బి నిడమానూరు గ్రామం క్రిస్టియన్ కాలనీ మహిళలకు పెద్దలకు “మీకు తెలుసా ” IEC, హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది .హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బి.వి.సాగర్ మాట్లాడుతూ గ్రామంలోని మహిళలకు పురుషులకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన,జాతీయ టోల్ ఫ్రీ 1097, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షత వల్ల బాధితులు తమ మనోధైర్యాన్ని కోల్పోయి భయాందోళన గురై ఆవేశం అవమానాలు భరించలేక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని, అంతేకాకుండా మానసిక శోభకు గురై ఆ ఒత్తిడిలో తక్కువ కాల పరిమితులోనే మరణించే ప్రమాదం ఉందని ఎట్టి పరిస్థితులు హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు పట్ల సమాజంలోని వారు వివక్షత చూపించకూడదని పేర్కొన్నారు, అవుట్ రీచ్ వర్కర్ ఎం మల్లేశ్వరి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు పట్ల వివక్షత విడనాడాలని వారిపట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలని వారికి ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై తగు సూచనలు సలహాలు ఇస్తూ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని మ్.మల్లేశ్వరి తెలిపారు తదనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కరపత్రాలు ప్రదర్శించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో క్రిస్టియన్ కాలనీలోని పెద్దలు, మహిళలు, మాజీ ఎంపీటీసీ లక్కేనబోయిన బాబురావు, బక్కా సుధాకర్, లక్కేనబోయిన ఏసేపు, పి ఈ లు దివ్య , తదితరులు పాల్గొన్నారు.