ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కారణంగా 3 రోజులుగా కురిసిన వర్షాలకు ఓ పెంకుటిల్లు కూలిపోయింది.ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణా నష్టం తప్పింది. కొన్ని సంవత్సరాలుగా వెంకటరత్నం అనే వృద్ధురాలు ఈ ఇంట్లో నివాసం ఉంటుంది.తన ఇల్లు కూలిపోవడంతో రోడ్డున పడ్డానని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది.విషయాన్ని తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ జితేంద్ర కుమార్ అక్కడికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించారు. బాధితురాలికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామన్నారు.