ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంకనాంపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పొలంలోకి నీళ్లు వదిలేందుకు వెళ్లి మోటర్ స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్ తో గ్రామానికి చెందిన నాగార్జున (26) అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనను గుర్తించిన స్థానిక రైతులు నాగార్జున కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు నాగార్జున మృతితో బోరున విలపించారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
