ప్రకాశం జిల్లా ఒంగోలు ఎక్సైజ్ సూపర్నెంట్ ఎస్.కె కాజా మొహిద్దిన్ నూతనంగా లైసెన్సులు పొందిన మద్యం షాపు యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు, ఆస్పత్రులకు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అధికారిక భవనాల నుండి నిర్దేశించిన దూర పరిమితిలోనే షాపులను నిర్వహించాలని, బెల్టు షాపులను నిర్వహిస్తే సహించబోమని, ధరల పట్టికను, సమయపాలనను పాటించాలని, అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరిపినట్లైతే 5 లక్షల వరకు జరిమానా విధించి వారి లైసెన్సును రద్దు చేస్తారని , భవిష్యత్తులో కూడా వారికి లైసెన్స్ రాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మద్యం పాలసీ అమలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఎటువంటి రాజకీయ ప్రలోభాలు, రాజకీయ నాయకుల జోక్యం ఉండదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎక్సైజ్ సీఐ సుకన్య, ఎస్సై శ్రీ నగేష్ , పలువురు షాపు యజమానులు, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.