జిల్లా కేంద్రమైన ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా , జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మరియు ఎస్పీ ఏ ఆర్ దామోదర్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసే వారి యొక్క హోదా మరియు సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని, భద్రత పరిరక్షణ చేపట్టాలని, ప్రోటోకాల్ పాటించాలని, కార్యక్రమంలో ఎటువంటి సమన్వయ లోపం జరగకూడదని చెప్పారు. అతిథులకు ,వీక్షకులకు సీట్ల కేటాయింపు, వాహనాల పార్కింగ్ ,భద్రతా పరిరక్షణ, త్రాగునీరు మరియు అల్పాహారం అందించే కార్యక్రమం ఎటువంటి లోపం జరగకుండా చూడాలని ఆదేశించారు. పోలీసు కవాతు సమయంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన నిర్దిష్ట సమయం ప్రకారం జరగాలని ఆదేశించారు.
ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భద్రతా పరిరక్షణ, సమయపాలన విషయంలో అధికారుల సంయమనం పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఒంగోలు డివిజన్ ఆర్డీవో సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు