ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఎంపీ చెరువులో గురువారం విద్యుత్ స్తంభంపై వీధి లైటు ఏర్పాటు చేస్తూ విద్యుత్ షాక్ తో స్తంభంపై నుండి క్రిందపడి వెంకటరమణ (23) మృతి చెందాడు. అంతకుముందు తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణను స్థానిక కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. జేబికె పురం గ్రామానికి చెందిన వెంకటరమణ కొద్ది రోజులుగా విద్యుత్తు లైన్మెన్ రాయుడు ఈ అబ్బాయి తో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతను విద్యుత్ ఘాతకానికి మరణించాడు ఇతనికి తల్లి ఇతని మీదే ఆధారపడి జీవిస్తున్నది తండ్రి మతిస్థిమితం లేక వెళ్ళిపోయాడు ఈ తల్లికి ఇక దిక్కు ఎవరు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణ కుటుంబ సభ్యులు తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
