- డీపీవో సిబ్బంది విధులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వర్తించాలి.
- డీపీవో కు సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లేకుండ సకాలంలో పూర్తి చెయ్యాలి
జిల్లా ఎస్పీ దామోదర్ పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలయిన డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డి.సి.ఆర్బీ, డిటిఆర్బీ, పరిపాలన విభాగంలోని A, B, P సెక్షన్లు, అడిషనల్ ఎస్పీల కార్యాలయాలు, DPO స్టోర్, మెసేజ్ సిస్టం రూమ్, సర్వీస్ బుక్ రూమ్, ఇన్వార్డ్/అవుట్ వార్డ్, రికార్డు రూమ్ లను పరిశీలించి ఒక్కోక్క విభాగం యొక్క పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు మరియు రికార్డ్స్ ను తనిఖీ చేసారు. జిల్లా పోలీస్ కార్యాలయం మరమత్తులు, నవీనకరణ చర్యలకు అధికారులకు పలు సూచనలు చేసారు.
ఆయా విభాగాలలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు మినిస్టీరియల్ స్టాఫ్ యొక్క విధుల గురించి ఎస్పీ ఆరా తీశారు. డీపీవో సిబ్బంది వారి సెక్షన్ల సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ఆయా సెక్షన్ల సిబ్బంది పనితీరును సూపరిండెంట్ లు తరచుగా తనిఖీ చెయ్యాలని, అన్ని ఫైల్స్ పెండింగ్ లేకుండ సకాలంలో పూర్తి చెయ్యాలని, రికార్డ్స్ ను క్రమపద్దతిలో ఉంచుకోవాలని ఆదేశించారు. SCRB, NCRB, హ్యూమన్ రైట్స్, ఎస్సీ/ఎస్టీ, మహిళా కమీషన్ మరియు ఇతర కమిషన్ల నుండి వచ్చిన పిర్యాదులను స్వీకరించి రిప్లైలు నిర్ణీత సమయంలో పంపించాలని సూచించారు.
సిబ్బంది వారివారి విధులలో అందరూ సమయపాలన పాటించాలని, విధులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వర్తించాలని, కార్యాలయ పరిసరాలు పరిశ్రుభంగా ఉంచుకోవాలని, పార్కింగ్ ప్రదేశంలో విధుల్లో ఉన్న సిబ్బంది యొక్క వాహనాలు మాత్రమే ఉంచాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించినా, ఫైల్స్ పెండింగ్లో ఉంచినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డిపిఓ ఏవో యం.సులోచన, డిసిఆర్బి ఇంచార్జి ఇన్స్పెక్టర్ వి. సూర్యనారాయణ, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామరెడ్డి, ఏ ఏ ఓ ఉష్మాన్ భాషా, డిపిఓ సూపరింటెండెంట్ లు శైలజ, సంధాని భాషా, యాస్మిన్ భాను మరియు తదితరులు ఉన్నారు.