ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం లోని వెలగలపాయ, రహదారి దుస్థితి ఇది..అర్ధవీడులోయ లోని రహదారుల పరిస్థితి కూడా ఇలాగే గజానికొక గుంత అడుగుకొక గొయ్యి అనే సామెతను తలపిస్తుంది .. కంభం నుండి ఈ రహదారులపై ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది.. రహదారుల మార్జిన్లలో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో ఒక వాహనం ఎదురుగా వస్తుంటే మరో వాహనం పోయేందుకు మార్గమే లేదు. ఇక మలుపుల వద్ద చెట్లు పెరిగిపోయి ఎదురు గా వచ్చే బస్సులు, ద్విచక్ర వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి..ఆర్ అండ్ బి శాఖ వారు వేసిన నాశిరకం రోడ్లు ఏడాదికే దెబ్బతింటాయి..అప్పుడప్పుడు రోడ్లకు నాశిరకం ప్యాచింగ్ లు కూడా ఆరు నెలలకే దెబ్బ తినడం షరా మామూలే.. రాత్రులలో రాకపోకలు సాగించేవారు రోడ్లపై గుంతలు కనపడక కింద పడిపోతున్న సంఘటనలు ఎన్నో .. చోటు చేసుకున్నాయి. కావున సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లను మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.