ప్రకాశం జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మార్కాపురం మండలం తిప్పాయపాలెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తిప్పాయపాలెం వద్ద టైర్ పంక్చర్ అయిన ఓ కారు ఎదురుగా వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి. ఊహించని ఈ పరిణామం నుంచి తేరుకునే లోపలే కారు పూర్తిగా దగ్ధం కాగా… అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయిల్ ట్యాంకర్ ను అక్కడే వదిలేసిన డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.