ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని చెంచుగూడాన్ని సబ్ కలెక్టర్లు సేతు మాధవన్,అభిషేక్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికంగా నివసిస్తున్న చెంచుల సమస్యలను వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అలానే ఇటీవల కాలంలో వ్యవసాయం చేసుకుంటున్న వారి భూముల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. చెంచుల అభివృద్ధికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా తక్షణమే సంబంధిత అధికారులు పరిష్కరించాలని వారిని సబ్ కలెక్టర్లు ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.