- వరద బాధితులకు శ్రీ ప్రతిభ ఆహార పొట్లాలు పంపిణీ
- బస్సులలో 2వేల పులిహార ప్యాకెట్లు పంపిన యాజమాన్యం
- బస్సులలో రెండు వేల పులిహార ప్యాకెట్లు పంపిణి చేసిన యాజమాన్యం
ప్రకాశం జిల్లా, పేర్నమిట్ట: రాష్ట్రంలో భారీ వర్షాలు కారణంగా వరద నీటిలో చిక్కుకుపోయిన బాధితులకు ఆహారం అందించేందుకు ప్రతిభ విద్యాసంస్థల యాజమాన్యం నడుము కట్టింది. అందులో భాగంగా రెండు వేల పులిహార ప్యాకెట్లను ప్యాకింగ్ చేయించి బస్సుల ద్వారా ప్రకాశం జిల్లా డీఈఓ కార్యాలయానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరదలలో చిక్కుకున్న ప్రజలను చూసి మనసు కలచివేసిందని అన్నారు. వెంటనే ఏదైనా సహాయం చేయాలని నిర్ణయం తీసుకుని వెంటనే ఆహార అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా రెండు వేల పులిహోర ప్యాకెట్లను తయారు చేయించడమే కాకుండా బస్సులలో ప్రకాశం జిల్లా డీఈఓ కార్యాలయానికి చేర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సీతారామాంజనేయులు, సీఈవో జయప్రకాష్ నారాయణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.