- ప్రజా సమస్యల పై ద్రుష్టి పెట్టని కలెక్టర్ తమీమ్ అన్సారీయా
- భూ దందాలా పై ఊసేలేదు
- అక్రమ మైనింగ్ మాఫియా .. పట్టదు
- స్థానిక మీడియా తో మాట్లాడకుండా వెళ్లిపోయిన కలెక్టర్
- ఎందుకొచ్చారు ? దేనికోసం వచ్చారు ?
- సమాచారం లేని కలెక్టర్ పర్యటన … ఎందుకు ?
ప్రకాశం జిల్లా, చీమకుర్తి : శవాలపై నాణేలు ఏరుకోవడం అంటే ఇదేనేమో .. ! కనిపించిన భుమునులల్లా కబ్జా చేయడమే కాకా స్మశానాలను కూడా వదలడం లేదు. మృతదేహాలను ఖననం చేసిన స్థలాలను తవ్వి వెంచర్లు వేసి మరీ విక్రయిస్తున్నారు. భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చెరువులు, కాలువలు, గోర్జీలు అని చూడడం లేదు. ప్రభుత్వ భూమి అంటే లెక్కలేదు. చివరికి శ్మశానాలను సైతం వదలడం లేదు. తాజాగా చీమకుర్తిలో ఇటువంటి భూ కబ్జా ఘటనే వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పాలెం స్మశాన వాటిక ఆక్రమణకు గురైందని ఆరోపణలు లేకపోలేదు. మనిషి అంత్యక్రియలకు అంత భూమి ఎందుకని భావించారో.. లేక తమకు అడ్డేలేదని అనుకున్నారో మరుభూమిని పంట భూమిగా మార్చేశారు. దీంతో రైతుల మాటున కొంచెంకొంచెం ఆక్రమించడం ప్రారంభించారు. ఇదేమని ప్రశ్నించే స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. స్థానికులు కొందరు ఫిర్యాదు చేసినప్పటికీ గత ప్రభుత్వంలో నామమాత్రపు సందర్శన చేసిన స్థానిక అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిర్లక్ష్యానికి ప్రధాన కారణం రాజకీయపరమైన కారణాలవటం గమనార్హం
ఈ విషయాలపై పలు వార్తలు రిపోర్టర్ టివి ప్రచురించినప్పటికీ అధికారులలో చలనం లేదు. నిన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా చీమకుర్తిలో పర్యటించారు. గ్రానైట్ క్వారీలలో జరుగుతున్నదారుణాల పై గాని, భూ కబ్జాల పై కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. చీమకుర్తి లో కలెక్టర్ ఎందుకు పర్యటించారో కూడా తెలియదు. స్థానిక రిపోర్టర్స్ తో మాట్లాడకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా వెళ్లిపోయారు. ఎందుకొచ్చినట్టు ..? ఏ పని మీద వచ్చినట్టు .. ?
చీమకుర్తి కి వచ్చిన కలెక్టర్ ఎటువంటి సమస్యల పై ద్రుష్టి పెట్టడానికి వచ్చారు ? ఓరియంట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగింది. కొండచెర్యలు విరిగిపడ్డట్టు పెద్ద పెద్ద బండరాళ్ళు కిందపడ్డాయి ఆనాడు ఎందుకు రాలేదు ? అక్రమ మైనింగ్ మాఫియా పై ఊసే లేదు. ప్రజా సమస్యల పై దృష్టి పెట్టని కలెక్టర్ జిల్లా కి అవసరమా ?
జిలాల్లో కలెక్టర్ పర్యటన అంటూ … ట్విట్టర్ లో ఫోటోలు పెట్టి పోస్ట్ చేసుకోవడం తప్పా, ప్రజలకు ఒరిగేదేమీలేదు. ప్రజా సమస్యల పై ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. ఇకనైనా రాష్త్ర సియం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగ పడని కలెక్టర్ల పై ద్రుష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.